ఏరియా 51 లో ఏం జరుగుతోంది – Area 51 Mystery in Telugu

అది 1950వ సంవత్సరం. అమెరికా రష్యా మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న కాలం. రష్యా పెద్ద సంఖ్యలో అణ్వాయుధాలను అమెరికాను భయపెట్టడానికి నిర్మిస్తుంది. భవిష్యత్తులో అమెరికాకు రష్యాకు మధ్యలో యుద్ధం జరిగితే అమెరికా ను ఓడించడానికి వీలుగా పెద్ద సంఖ్యలో అణ్వాయుధాలు మరియు క్షిపణులు రష్యా తయారు చేస్తోంది. అమెరికా రష్యా యొక్క అణ్వాయుధాలు మరియు సైనిక స్థావరాల సమాచారం సేకరించడానికి రష్యా మీదుగా తన గూఢచార విమానాలను పంపిస్తోంది కానీ రష్యా యొక్క రాడార్ అమెరికన్ విమానాలను పసిగట్టి తన క్షిపణుల తో తన భూభాగంపై ఆకాశంలో ఎగురుతూ గూఢచర్యం చేస్తున్న అమెరికన్ విమానాలను చాలా సులువుగా కూల్చేస్తోంది . రష్యన్ రాడార్ మరియు క్షిపణులకు దొరకకుండా రష్యాపై విమానాలతో గూఢచర్యం చేయాలంటే అమెరికా కొత్త తరహా విమానాలను తయారు చేయాలి. ఈ కొత్త తరహా విమానాలు ఆ కాలంలో విమానాలు ఎగిరే ఎత్తు కన్నా చాలా రెట్లు ఎక్కువ ఎత్తుకు ఎగర గలిగేలా ఉండాలి.

ఇలాంటి కొత్త తరహా విమానాలను తయారుచేయడానికి అమెరికా నెవాడా రాష్ట్రంలోని ఎడారిలో ఏరియా 51 అనే ప్రదేశంలో ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రదేశంలో జనసంచారం చాలా తక్కువ. కొన్ని వందల కిలోమీటర్ల వరకు మనుషులు ఎవరు కనిపించరు. శత్రు దేశాల గూఢచారుల కు మరియు సాధారణ ప్రజలకు తెలియకుండా అధునాతన ఆయుధాలను నిర్మించడానికి మరియు పరీక్షించడానికి ఇది చాలా అనువైన ప్రదేశమని అమెరికన్ ప్రభుత్వం భావించింది.


రష్యన్ రాడార్ మరియు క్షిపణుల కు అందకుండా సాధారణ విమానాల కంటే ఎన్నో రెట్లు ఎత్తుకు ఎగరగలిగే యూటూ విమానాలను అమెరికా ఈ ఏరియా 51 లోనే నిర్మించింది, ఈ విమానాలను ఎన్నో నెలలు ఏరియా 51 లో పరీక్షించాక రష్యా సైనిక స్థావరాలు మరియు అణ్వాయుధాల స్థావరాల ఫోటోలు తీయడానికి రహస్యంగా రష్యా పైకి పంపించింది. ఈ విమానాలు విజయవంతంగా రష్యా సైనిక మరియు అణ్వాయుధాల స్థావరాల ఫోటోలు చాలా స్పష్టంగా తీసి అమెరికన్ సైన్యానికి అందించింది.
అయితే కొన్ని సంవత్సరాల తర్వాత రష్యా తన రాడార్ మరియు క్షిపణులను ఆధునీకరించడం వల్ల అత్యంత ఎత్తులో ఎగురుతున్న ఈ యుటు విమానాలను గుర్తించి క్షీపనులతో ఈ విమానాలను నేల కూల్చడం మొదలు పెట్టింది. దీంతో కంగారు పడిన అమెరికా రష్యన్ రాడార్ లకు దొరక కుండ ఉండే కొత్తరకం విమానాలను అభివృద్ధి చేయాలని అమెరికన్ సైంటిస్టులను ఆదేశించింది. అమెరికన్ శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లు కష్టపడి ఏ 12 అనే కొత్త తరహా విమానాన్ని నిర్మించారు. ఈ విమానం యూ 2 విమానం కంటే ఎన్నో రెట్లు వేగంగా మరియు ఎక్కువ ఎత్తులో ఎగర గలదు. రష్యన్ రాడార్ లకు చిక్కకుండా ఉండే ఆధునిక సాంకేతికతను ఈ విమానంలో ప్రవేశపెట్టారు. దీని తర్వాత ఎఫ్ 117 నైట్ హాక్ మరియు బోయింగ్ వై ఎఫ్ 118 G బర్డ్ ఆఫ్ ప్రే అనే అత్యాధునిక యుద్ధ విమానాలను కూడా ఈ ఏరియా 51 లోనే తయారుచేసి పరీక్షించారు.


ఈ ఏరియా 51 లో ఎవరు ప్రవేశించకుండా చుట్టూ అత్యాధునిక సెన్సార్లు కలిగిన కంచెను ఏర్పాటు చేశారు. ఈ కంచె దాటి ఒక చిన్న చీమ కూడా లోపలికి ప్రవేశించినా వెంటనే అక్కడి సెక్యూరిటీ గార్డులకు తెలిసిపోతుంది. ఏరియా ఫిఫ్టీ వన్ వైపు వెళ్లే రోడ్డులో సెన్సార్ లను అమర్చారు దీంతో అటువైపు వెళ్తున్న కార్ల వివరాలు కొన్ని కిలోమీటర్ల ముందే అక్కడి సెక్యూరిటీ అధికారులకు తెలిసిపోతుంది. ఏరియా 51 చుట్టూ కొండలపై కెమెరాలు అమర్చారు. ఈ కెమెరాలతో అటు వైపు వచ్చే కార్లు మరియు మనుషులపై 24 గంటలు నిఘా పెడతారు. అటువైపు ఎవరైనా వస్తున్నట్టు గమనిస్తే సెక్యూరిటీ గార్డులు వారిని అడ్డుకొని వెనక్కు వెళ్లాలని ఆదేశిస్తారు. ఎవరైనా మాట వినకపోతే వారిని అరెస్టు చేయడం లేదా వారిని తుపాకీతో కాల్చి పారేసే అధికారం కూడా అమెరికన్ ప్రభుత్వం ఇక్కడి సెక్యూరిటీ గార్డులకు ఇచ్చింది.


ఈ ఏరియా 51 లో పనిచేసే ఉద్యోగులు ప్రత్యేక విమానంలో ప్రతిరోజు ఉదయం వచ్చి పని ముగించుకుని సాయంత్రం అదే విమానంలో తమ ఇళ్లకు బయలుదేరతారు. ఈ స్థావరం 1955 లో ప్రారంభమైన 2013 వరకు అమెరికన్ ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని రహస్యంగా ఉంచింది. మొదటిసారిగా 2013లో ఏరియా 51 లో తమ సైనిక స్థావరం ఉందని అంగీకరించింది. అసలు అమెరికన్ ప్రభుత్వం ఒక సైనిక స్థావరాన్ని ఇంత రహస్యంగా ఉంచడం ప్రజలలో పలు అనుమానాలను కలిగిస్తుంది.
ఈ ప్రదేశానికి సమీపంలో నివసించే చాలామంది ప్రజలు రాత్రిపూట విచిత్రమైన వెలుతురుతో ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. గుండ్రటి పళ్లెం లాంటి ఆకారంలో రాత్రిపూట ఆకాశంలో చాలా వేగంగా కదులుతున్న యూ.ఎఫ్.ఓ లను చాలాసార్లు చూశామని ఈ ప్రదేశం చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు చెప్తారు.
1947 సంవత్సరంలో అమెరికాలోని roswell న్యూ మెక్సికో లో ఏలియన్స్ ప్రయాణిస్తున్న ఒక యు.ఎఫ్.ఒ ఎడారిలో కూలిపోయిందని దాన్ని అమెరికన్ సైన్యం ఈ ఏరియా 51 కి తరలించి ఆయు ఎఫ్ ఓ పై అమెరికన్ ప్రభుత్వం పరిశోధనలు చేస్తుందని చాలామంది అమెరికన్ ప్రజలు నమ్ముతారు. ఆ యూ ఎ ఎఫ్ ఓ తో పాటు వేరే గ్రహాలకు చెందిన చనిపోయిన ఏలియన్స్ శరీరాలు కూడా ఆ ప్రదేశంలో లభించాయని చాలామంది నమ్ముతారు. ఆ దుర్ఘటనలో కొన్ని ఏలియన్స్ ప్రాణాలతో అమెరికన్ సైన్యానికి పట్టుబడ్డాయి అని అమెరికన్ ప్రభుత్వం ఆ ఏలియన్స్ ని ఏరియా 51 లో ఉంచి రీసెర్చ్ చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే అమెరికన్ ప్రభుత్వ ము న్యూ మెక్సికోలో దొరికింది యు ఎఫ్ ఓ కాదని అది వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ప్రయోగించిన ఒక వెదర్ బెలూన్ అని చెబుతోంది.


అయితే ఈ ఏరియా ఫిఫ్టీ వన్ లో గతంలో పనిచేసిన కొందరు సైంటిస్టులు తాము రిటైర్ అయిన తర్వాత కొన్ని నమ్మలేని నిజాలు ప్రజల ముందుకు తెచ్చారు. అందులో ఒకరే BOYD BUSHMAN అనే సీనియర్ శాస్త్రవేత్త. ఈయన గతంలో లాక్హీడ్ మార్టిన్ అనే విమానాలు నిర్మించే కంపెనీలో మరియు ఏరియా 51 లో పని చేసాడు. ఈయన పేరు పై 37 పేటెంట్లు ఉన్నాయి. ఈయన తాను చనిపోయే ముందు ఒక వీడియో లో ఏరియా 51 లో యు ఎఫ్ ఓ లు ఉన్నాయని అక్కడ సైంటిస్టులు ఆ యు.ఎఫ్.ఓ లపై రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారని తెలిపారు. ఆ యు.ఎఫ్.ఓ ల నుండి సంపాదించిన టెక్నాలజీని అమెరికా తన కొత్త విమానాలను ఆధునీకరించిన డానికి వాడు తుందని తెలిపారు. ఏరియా 51 లో చనిపోయిన ఏలియన్ ల శరీరాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని కూడా చెప్పారు. ఇంకా ఏరియా 51 లో బ్రతికి ఉన్న ఏలియన్లు కూడా ఉన్నాయని తాను వాటితో కలిసి పని చేశానని తెలిపారు. గత 70 సంవత్సరాలలో ప్రపంచం ఎన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం ఏరియా 51 లో సంపాదించిన గ్రహాంతరవాసుల టెక్నాలజీ నే కారణమని తెలిపారు.


బాబు లాజర్ అనే వ్యక్తి కూడా తాను గతంలో ఏరియా 51 లో శాస్త్రవేత్తగా పని చేశానని అక్కడ ఏలియన్ లను చూశానని చెప్పాడు. ఆంటీ గ్రావిటీ టెక్నాలజీతో పనిచేసే యు ఎఫ్ ఓ లు ఏరియా 51 లో ఉన్నాయని తాను వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఆ టెక్నాలజీతో కొత్త యుద్ధ విమానాలు తయారుచేసే పనిలో పాలు పంచుకున్నానని చెప్పాడు.
ఈ ఏరియా 51 దగ్గర్లోనే నెవాడా స్టేట్ హైవే 375 ఉంది. ఈ రోడ్డుకు అధికారికంగా extra-terrestrial హైవే అని పేరు ఉంది. ఈ హైవే ని ఏలియన్ హైవే అని కూడా అంటారు. ఈ రోడ్డుపై చాలామంది యు ఎఫ్ ఓ లను చూశామని చెప్తారు. ప్రతి సంవత్సరం ఈ రోడ్డు పైనే అత్యధికంగా యు ఎఫ్ ఓ లు కనిపించిన కేసులు అమెరికాలో నమోదవుతున్నాయి. ఈ ఏరియా 51 చుట్టుపక్కల ప్రతి సంవత్సరం అనుమానాస్పదస్థితిలో జంతువుల కలేబరాలు దొరుకుతున్నాయి. వీటి శరీరాలపై ఎటువంటి గాయాలు లేకుండా శరీరంలో రక్తం ఎవరో పీల్చేసినట్టు దొరుకుతున్నాయి. వీటిని ఏలియన్స్ అదృశ్యం చేసి వీటిపై పరిశోధనలు జరిపి ఇలా వదిలి వేస్తున్నాయని స్థానికులు నమ్ముతారు. అమెరికన్ అధికారులు ఈ కేసులను ఎంత విచారించిన దీని వెనుక కారణాలను తెలుసుకోలేకపోయారు.
అయితే అమెరికా ప్రభుత్వం మాత్రం ఏరియా 51 లో ఎటువంటి యు ఎఫ్ ఓ లు మరియు ఏలియన్ లు లేవని ఇది కేవలం ఆధునిక యుద్ధ విమానాలు తయారుచేసి పరీక్షించే ఒక అమెరికన్ సైనిక స్థావరము అని చెబుతోంది. కానీ ప్రజలు మాత్రం ఏరియా 51 లో తమ ఊహకు అందనిది ఏదో జరుగుతుందని అందుకే ప్రభుత్వం ఏరియా 51 నీ ఇంత రహస్యంగా ఉంచుతుందని చెబుతున్నారు.

Don`t copy text!