బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం – Bermuda Triangle Mystery in Telugu

అది డిసెంబర్ 5 , 1945 . అమెరికాకు చెందిన ఐదు టోర్పీడో బాంబర్ యుద్ధ విమానాలు రొటీన్ ట్రైనింగ్ కోసం ఫ్లోరిడాలోని ఒక ఎయిర్ బేస్ నుంచి ఆరోజు బయలుదేరాయి. ఈ యుద్ధ విమానాలు ఆ కాలానికి అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలు. విమానం బయలు దేరిన కొద్ది సేపటికే ఆ విమానాన్ని నడిపిస్తున్న ఒక సైనికుడు రేడియోలో కంట్రోల్ రూమ్ తో మాట్లాడుతూ అంటున్నాడు ఈ రోజు అంతా చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది సముద్రం కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది అని చెప్పి కొద్ది సేపటి తరువాత ఆ రేడియొ మూగబోయింది . కాసేపటికే ఐదు యుద్ధ విమానాలు బయలుదేరిన నాలుగు గంటల్లోనే ఎటువంటి జాడ లేకుండా సముద్రంలో అదృశ్యమైపోయాయి .ఆ యుద్ధ విమానాలను వెతకడానికి నావి కి చెందిన సెర్చ్ అండ్ రెస్క్యూ విమానం బయలుదేరింది . ఇరవై నిమిషాల తరువాత రాత్రి ఏడుగంటల 47 నిమిషాలకు సెర్చ్ అండ్ రెస్క్యూ విమానం కూడా మాయమై పోయింది . అమెరికన్ నేవీ మళ్లీ ఈ అదృశ్యమై పోయిన విమానాల జాడ తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున తన విమానాలు మరియు ఓడలతో ముమ్మరంగా గాలించింది. అయితే ఎంత వెతికినా విమానాల జాడను కని పెట్ట లేక పోయింది. ఆ విమానాల శకలాలు కూడా లభించలేదు

. ఈ విమానాలకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి అమెరికన్ నావి ఏర్పాటుచేసిన ఒక విచారణ కమిషన్ తన అధికారిక రిపోర్టులో ఈ విమానాలకు ఏం జరిగిందో కనిపెట్టలేకపోయామని కనీసం ఆ విమానాలకు ఏం జరిగిందో తమ ఊహకు కూడా అందడం లేదని తమ తుది నివేదికలో రాశారు. 60 సంవత్సరాల నుంచి ఆ విమానాలకు ఏం జరిగి ఉండొచ్చు అని రకరకాల ఊహాగానాలు ప్రజల మధ్య వినిపిస్తున్నాయి. ఈ విమానాలు అదృశ్యమైన ప్రదేశాన్ని బర్ముడా ట్రయాంగిల్ అని అంటారు. అమెరికాలోని మియామీ , బెర్ముడా ద్వీపాలు , ప్యూర్టో రికో ద్వీపాల మధ్యలో ఉన్న సముద్రాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అని అంటారు.


ఈ ప్రదేశం గురించి మొట్టమొదటగా 1492 లో కొలంబస్ తన పుస్తకంలో ఒక సంఘటన ను రాశాడు . ఈ ప్రదేశం నుండి కొలంబస్ తన నౌక లో వెళ్తున్నప్పుడు ఆకాశంలో గుర్తుతెలియని పెద్ద వెలుతురు కనిపించిందని, నౌకలోని దిక్సూచి పని చేయడం మానేసింది అని తన డైరీలో రాసుకు న్నాడు. అప్పటినుండి ఎవరికి అంతుచిక్కకుండా ఈ ప్రదేశంలో అనేక నౌకలు మరియు విమానాలు అదృశ్యమైపోయాయి. మనిషి సుదూరంలో ఉన్న అంతరిక్షం , నక్షత్రాలు గ్రహాల గురించి ఎన్నో రహస్యాలు చేదిస్తున్నాడు కానీ మన భూమి పైన ఉన్న ఎన్నో ప్రదేశాల రహస్యాలను ఇప్పటికీ చేదించలేక పోయాడు. అందులో ఒక ప్రదేశమే ఈ బెర్ముడా ట్రయాంగిల్. టైం మ్యాగజైన్ ప్రకారం 1946 నుండి 1991 మధ్యలో వందకు పైగా నౌకలు మరియు విమానాలు బెర్ముడా ట్రయాంగిల్ లో అదృశ్యమయ్యాయి.


మార్చి 4 , 1918 లో uss cyclops అనే అమెరికా నావి కి చెందిన ఇంధన నౌక ఈ బెర్ముడా ట్రయాంగిల్ లో అదృశ్యమైపోయింది. ఈ నౌకలో అమెరికా నావి కి చెందిన 300 మంది సైనికులు కూడా ఉన్నారు. అందరిని ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే ఈ నౌక యొక్క క్యాప్టెన్ నౌక ప్రమాదంలో ఉందని ఎటువంటి రేడియో మెసేజ్ లు పంపించలేదు. ఈ నౌకను సంప్రదించడానికి చేసిన అనేక కాల్స్ కు నౌకపై ఉన్న ఎవరు స్పందించలేదు . ఎవరికి అంతుచిక్కని రీతిలో ఈ నౌక మాయమై పోయింది.


డిసెంబర్ 28 1948 రోజున 26 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఒక విమానం కూడా ఈ ప్రదేశంలోనే మాయమై పోయింది. అక్టోబర్ 1951 సదరన్ డిస్ట్రిక్ అనే అమెరికన్ యుద్ధనౌక కూడా ఈ బెర్ముడా ట్రయాంగిల్ లోనే ప్రయాణిస్తూ సడన్ గా అదృశ్యమైపోయింది . ఇప్పటివరకు ఈ నౌక యొక్క శకలాలు కూడా లభించలేదు. అది డిసెంబర్ 22 1967 విచ్ క్రాఫ్ట్ అనే క్యాబిన్ క్రూజ్ నౌక ఇద్దరు ప్రయాణికులతో బయలుదేరింది. ఇద్దరు ప్రయాణికుల లో ఒకడు డాన్ buraq అనే చాలా అనుభవం కలిగిన నావికుడు. ఈ నౌక యొక్క ప్రత్యేకత ఏంటంటే నౌకకు సముద్రంలో ఏదైనా ప్రమాదం ఎదురైతే ఎట్టి పరిస్థితులలో సముద్రంలో మునిగిపోకుండా నీటి పైన తేలే విధంగా ఈ నౌకలో అధునాతన సాంకేతికతను జోడించారు . ఈ నౌక నీటిలో మునిగి పోవడం దాదాపు అసాధ్యం . ఈ నౌక కూడా ఈ బెర్ముడా ట్రయాంగిల్ లో మాయమై పోయింది. ఇప్పటివరకు ఈ నౌక యొక్క ఆనవాళ్లు కూడా ఎవరికి దొరకలేదు.
ఈ బెర్ముడా ట్రయాంగిల్ లో మాయమైన నౌకలు మరియు విమానాల లో ఇవి కొన్ని మాత్రమే. ఈ ప్రదేశంలో మాయమైన అన్నీ నౌకలు మరియు విమానాల గురించి చెప్పాలంటే ఒక్కరోజు కూడా సరిపోదు .


అసలు ఈ ప్రదేశంలో ఇన్ని నౌకలు మరియు విమానాలు అదృశ్యం కావడానికి వెనక కొన్ని కారణాలు ఉండొచ్చని కొందరు అనుమానిస్తున్నారు. అందులో మొదటిది బెర్ముడా ట్రయాంగిల్ ప్రకృతి సిద్ధంగానే చాలా ప్రమాదకరమైన ప్రదేశమని , ఈ ప్రదేశంలో మామూలుగానే అతి భయంకరమైన సముద్రపు తుఫానులు సంవత్సరపు పొడుగునా వస్తూ ఉంటాయని కొందరు శాస్త్రవేత్తలు చెప్తారు . ఇవి ఎంతటి శక్తివంతమైన నౌక లేదా విమానాన్ని అయినా ఇట్టే క్షణంలో నాశనం చేసే శక్తిని కలిగి ఉంటాయి. ఈ ప్రదేశంలో సముద్రము కూడా చాలా లోతుగా ఉంటుంది. నౌక లేదా విమానం కూలిపోయిన తర్వాత వాటి శకలాలు ఈ ప్రదేశంలో సముద్రపు అడుగు కు చేరుకుంటాయి . అంత లోతులోకి వెళ్లి ఆ శకలాలను గుర్తించి పైకి తీసుకు రావడం దాదాపు అసాధ్యం. అందుకే ఇక్కడ మాయమై పోయిన నౌకలు మరియు విమానాల శకలాలు లభించడం లేదని కొంతమంది పరిశోధకులు అంటున్నారు.


రెండవ కారణం , బెర్ముడా ట్రయాంగిల్ లో సముద్రం కింద ప్రాచీన అట్లాంటిస్ నగరం ఉందని కొంతమంది భావిస్తున్నారు . ఈ అట్లాంటిస్ నగరం ఒక ప్రాచీన గ్రీకు నగరం. ఈ నగరం కొన్ని వేల సంవత్సరాల క్రితం అత్యంత అభివృద్ధి చెందిన నగరం. ఆ నగరం లో మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కంటే ఎన్నో రెట్లు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేవారని ఎంతోమంది నమ్ముతారు. ఈ నగరం కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రంలో హఠాత్తుగా మునిగిపోయింది. ఆ నగరంలో ఉన్న ఏదో శక్తివంతమైన ప్రాచీన యంత్రం నుండి వస్తున్న అతి శక్తివంతమైన కిరణాల వల్ల ఆ ప్రదేశంపై నుంచి వెళ్తున్న నౌకలు మరియు విమానాలు ముక్కలు అయిపోతున్నాయి అని కొంతమంది భావిస్తున్నారు.


మూడవ కారణం ఈ ప్రదేశంలో వేరే గ్రహాలకు చెందిన ఏలియన్స్ తమ స్థావరాన్ని ఏర్పరచుకున్నాయి అని ఆ ప్రదేశం నుంచి వెళ్తున్న నౌకలు విమానాలను అవే మాయం చేస్తున్నాయని కొంతమంది భావిస్తున్నారు .
నాల్గవ కారణం ఈ ప్రదేశంలో సముద్రం కింద ఉన్న భూమి ప్రత్యేక అయస్కాంత గుణాన్ని కలిగి ఉందని అది ఆ ప్రదేశంలో వెళ్తున్న నౌకలు మరియు విమానాల దిక్సూచిని సరిగ్గా పని చేయకుండా చేస్తుందని మరికొంతమంది భావిస్తున్నారు. దీని వల్ల నౌకలు మరియు విమానాలు దారి తప్పిపోయి సముద్రంలో మాయమవుతున్నాయి అని కొందరు భావిస్తున్నారు .


ఇంకొంతమంది ఈ సముద్రం కింద వింతైన భారీ సముద్రపు జీవులు నివసిస్తున్నాయి అని అవి తమ పైనుంచి వెళ్తున్న నౌకలు మరియు విమానాలను సముద్రంలోకి లాగేస్తున్నాయి అని భావిస్తున్నారు. అయితే కొంతమంది ఈ బెర్ముడా ట్రయాంగిల్ వేరే లోకాలకు తీసుకెళ్లే ఒక ద్వారం లాంటిదని ఈ ప్రదేశంలో మాయమైపోయిన నౌకలు మరియు విమానాలు వేరే లోకాలలో ప్రత్యక్షమౌతాయి అని భావిస్తారు.
ఈ బెర్ముడా ట్రయాంగిల్ గురించి కొలంబస్ మొదటిసారి రాసి 500 సంవత్సరాలు అయినా దీని రహస్యం ఇప్పటివరకు వీడలేదు. భవిష్యత్తులో దీని రహస్యం వీడుతుంది అన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఈ ప్రదేశం లో ఒక్కసారి అదృశ్యమైపోయిన నౌకలు , విమానాలు మరియు ప్రజలు మళ్లీ ఎప్పటికి , ఎవ్వరికి కనిపించరు.

Don`t copy text!